మన్యంలో టెన్షన్.. ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న గిరిజన మహిళలు (వీడియో)

by  |
మన్యంలో టెన్షన్.. ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న గిరిజన మహిళలు (వీడియో)
X

దిశ, అచ్చంపేట : నల్లమల ప్రాంతంలో పోడు భూముల సాగు చేసుకుంటున్న రైతులకు ఎక్కడో ఒక చోట అటవీశాఖ అధికారుల నుండి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. గడిచిన రెండు నెలల నుంచి అటవీశాఖ అధికారులకు నల్లమల ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీ గిరిజనులకు, ఇతర గిరిజనేతర రైతుల మధ్య నిత్యం అధికారులు రైతులతో పోడు భూములకు సంబంధించి పోరు కొనసాగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాధవనిపల్లి గ్రామం తాటి చెల్క పోడు భూములలో మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారులు వెళ్లారు. దీంతో మదవనిపల్లి గ్రామ ప్రజలు, రైతులు, అధికారులను అడ్డుకొని బీ కే తిరుమలాపూర్ రోడ్డుపై ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రైతులకు, అటవీ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులు తాము సాగుచేస్తున్న పోడు భూములలో ఫారెస్ట్ అధికారులు బలవంతంగా మొక్కలు నాటడం భావ్యం కాదని, ఉన్న కాస్త భూమిని సాగు చేసుకుంటూ బతుకుతున్న మాకు చీకటి బతుకులు కలిగించవద్దని అధికారులను వేడుకుంటున్నారు. రైతులకు అటవీ అధికారులు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు పట్టించుకొని…

మా పోడు భూముల సమస్యలు తీర్చే విధంగా చూడాలని ఉన్నతాధికారులు కనికరించి నష్టం కలిగించకుండా ఉండాలని రైతులు కోరుతున్నారు. అలాగే పోడు భూముల విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేయకుండా రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని నల్లమల ప్రాంత రైతులు వేడుకుంటున్నారు.

ప్రజాప్రతినిధుల మాట వినడం లేదు …

పోడు భూముల విషయంలో రైతులకు అండగా స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యే, ప్రజల పక్షాన, రైతుల పక్షాన, నిలబడి అటవీ శాఖ అధికారులతో మాట్లాడుతున్నా.. అటవీశాఖ అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు న్యాయం చేస్తామని రైతుల నుంచి పైసలు తీసుకొని మోసం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఫారెస్ట్ వారీ దౌర్జన్యం….

సాగు చేసుకుంటున్న భూములలో అన్యాయంగా నర్సరీ ఏర్పాట్లు చేయాలనుకోవడం దుర్మార్గమైన పద్ధతిని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్టు అధికారుల దౌర్జన్యాలు అధికమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను అరెస్టు చేస్తున్న నేపథ్యంలో అటవీశాఖ, పోలీసుల, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులను అటవీశాఖ అధికారులు వాహనాలలో ఎక్కించి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంగా అధికారుల వాహనాలకు మహిళ రైతులు అడ్డుతగిలారు. ఈ సందర్భంగా రైతులకు అధికారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Next Story

Most Viewed