ఇదెక్కడి న్యాయం.. పాతవాళ్లను పక్కన పెడతారా !

by  |
ఇదెక్కడి న్యాయం.. పాతవాళ్లను పక్కన పెడతారా !
X

దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ అటవీ విభాగంలో 2006 నుంచి పనిచేస్తున్న సిబ్బందిని పక్కన పెట్టి 2013లో చేరిన వారిని రెగ్యులర్​ చేయడం అన్యాయమని సీఐటీయూ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు. సోమవారం తిరుపతిలోని డీఎఫ్ఓ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ అటవీ విభాగంలో 362మంది కార్మికులకు అన్ని అలవెన్సులతో కూడిన టైం స్కేలును అమలు చేయాలని డిమాండ్ చేశారు. అటవీ విభాగంలోని కార్మికులందరినీ ఒకే దృష్టితో చూడాలని, వివక్ష చూపొద్దని విజ్ఞప్తి చేశారు. నూతన ఈవో జవహర్‌రెడ్డి అటవీ కార్మికుల విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని అభ్యర్థించారు. అనంతరం డీఎఫ్​ఓకు వినతి పత్రం సమర్పించారు.

Next Story

Most Viewed