భూ కబ్జా వ్యవహారంలో మరో ట్విస్ట్.. తెరపైకి ఈటల ‘కొడుకు’

by  |
భూ కబ్జా వ్యవహారంలో మరో ట్విస్ట్.. తెరపైకి ఈటల ‘కొడుకు’
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కొద్ది రోజులుగా ఈటల రాజేందర్ భూ కజ్జా వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్నది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం దూకుడుగా పని చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి ఈటల భూ కజ్జా వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్‌కు మరో ఫిర్యాదు అందినట్టు సమాచారం. ఈటల కొడుకు నితిన్ రెడ్డి భూ కబ్జా చేశారని మేడ్చల్ జిల్లా రావల్‌కోల్‌కు చెందిన మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి.. సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఫిర్యాదుపై వెంటనే విచారణ ప్రారంభించాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను కోరారు. ఏసీబీ, విజిలెన్స్, రెవెన్యూ శాఖలతో సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Next Story

Most Viewed