క్యూఆర్ కోడ్‌తో.. షీ టీమ్స్ సహాయం

by  |
క్యూఆర్ కోడ్‌తో.. షీ టీమ్స్ సహాయం
X

దిశ, ఆసిఫాబాద్: మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన షీ టీం సేవలు జిల్లాలో మరింత పటిష్టం కానున్నాయని జిల్లా ఎస్పీ పైవి సుధీంద్ర తెలిపారు. జిల్లా కేంద్రంలో “షీటీం” జిల్లా కార్యాలయాన్ని, షీ టీం క్యూఆర్ కోడ్ పోస్టర్ శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షీ టీం సేవలను జిల్లాలోని మహిళలు ఉపయోగించుకోవాలని తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లాలో షీటీమ్ సేవలు మరింత పటిష్టం కానున్నాయని అన్నారు.

ఆకతాయిల వలన గానీ, ఇతర కారణాలతో వేధింపులకు గురివుతున్న మహిళలు, విద్యార్థినులు వెంటనే షీ టీం కు గానీ, డైలీ 100 కు గానీ సమాచారం అందించాలని కోరారు. మహిళలపై లైంగిక దాడులు, మానసికంగా వేధింపులకు పాల్పడే వారి భరతం పట్టడానికే ఉన్నతాధికారులు షీ టీమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళలు, విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. షీ టీమ్స్ ప్రాముఖ్యతను పెంచడానికి నిరంతరం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని, అందరూ కూడా నిస్సందేహంగా షీ టీం సేవలను సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఎవరైనా ఆకతాయిల గురించి సమాచారం అందించిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ అశోక్, షీ టీం సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed