బహిరంగ చర్చకు ఈటల ఎందుకు రాలేదు..?

by  |
బహిరంగ చర్చకు ఈటల ఎందుకు రాలేదు..?
X

దిశ, హుజురాబాద్: అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన వ్యవహారంలో రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ కానీ అతని అనుచరులు కానీ బహిరంగ చర్చకు ఎందుకు రాలేదని హుజురాబాద్ టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. బుధవారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఈటల కొనుగోలు చేసిన భూములపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేసి తాము ముందుగానే అక్కడకు చేరుకున్నామన్నారు. ఇదే అంబేడ్కర్ సాక్షిగా పలమార్లు సీఎం కేసీఆర్ ను కొనియాడిన ఈటల ఇప్పుడు ఆరోపణలు చేస్తుండడం సమంజసం కాదన్నారు.

2003 లో కమలాకపూర్ నియోజకవర్గంలో అడుగు పెట్టిన రాజేందర్ టీఆర్ఎస్ నాయకునిగానే వచ్చారు. కానీ రాజేందర్ వల్ల ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పట్టు సాధించలేదని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. తాను చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని వారు హితవు పలికారు. వాస్తవాలు ప్రజలకు వివరించేందుకు బహిరంగ చర్చకు వస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు.

Next Story