అంబులెన్స్‌ల దోపిడీకి అడ్డుకట్ట.. కలెక్టర్ కీలక ఆదేశాలు

by  |
అంబులెన్స్‌ల దోపిడీకి అడ్డుకట్ట.. కలెక్టర్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండగా.. రికార్డు స్థాయిలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో అంబులెన్సులు కొవిడ్ మృతదేహాల తరలింపు పేరుతో సామాన్యులను దోచుకుంటున్నారు. వారు అడిగినంత ముట్టచెబితేనే డెడ్‌బాడీని తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్టా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అంబులెన్స్‌ల దోపిడీకి అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు తీసుకున్నారు. మృతదేహాల తరలింపు విషయంలో ఏ వాహనానికి ఎంత రేటు, ఎన్ని కిలో మీటర్లకు ఎంత తీసుకోవాలి అని ధరలతో కూడిన కార్డును రిలీజ్ చేశారు. ప్రతీ అంబులెన్స్ ఇవే ధరలను ప్రజల నుండి వసూలు చేయాలని ఆదేశించారు. ఎక్కువ డబ్బు వసూలు చేసినట్టు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story

Most Viewed