ముందు జాగ్ర‌త్త‌ల‌తో కాపాడుకోగ‌లిగాం

by  |
ముందు జాగ్ర‌త్త‌ల‌తో కాపాడుకోగ‌లిగాం
X

దిశ‌, కొత్త‌గూడెం: ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వరద ముప్పు నుంచి ప్రజలను కపాడుకోగలిగామని భ‌ద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. మంగళవారం భ‌ద్రాద్రి దుమ్ముగూడెం మండలంలోని కాశీనగరం గ్రామంలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. జాన్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి వరద వల్ల వచ్చిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులమ గ్రామస్తుల‌ను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

రెవెన్యూ అధికారులు కుల ధ్రువీక‌ర‌ణ పత్రాలు మంజూరు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పై చదువులకు కానీ ఉద్యోగ అవకాశాలు కోసం దరఖాస్తు చేయడానికి కుల ధ్రువీక‌ర‌ణ పత్రాలు లేక యువత ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్తు సౌకర్యం కోసం దరఖాస్తు చేయాలన్నా, ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఫిర్యాదు చేయ‌డంతో వెంట‌నే క‌లెక్ట‌ర్ ఆదేశాలు జారీ చేశారు. సీతమ్మ బ్యారేజీ నిర్మాణంతో తమ ఇండ్లు, పొలాలు మునిగి పోతాయని తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరగా, తీసుకున్న భూములకు పరిహారం చెల్లిస్తామని క‌లెక్ట‌ర్‌ చెప్పారు.

అనంతరం సున్నంబట్టి, గంగోలు గ్రామాలు వరద ముంపునకు గురైనందున ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రంలో ఉన్న ప్రజలను సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన అత్యవసర చికిత్స కేంద్రంలో వైద్య సిబ్బంది కలెక్టర్‌కు బీపీ, పల్స్ ఆక్సీ మీటర్ ద్వారా గుండె వేగం, ధర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు నిరంతరం ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు.


Next Story