నిర్దేశిత లక్ష్యాలు సాధించని వైద్యులపై చర్యలు: కలెక్టర్ శరత్

by  |
నిర్దేశిత లక్ష్యాలు సాధించని వైద్యులపై చర్యలు: కలెక్టర్ శరత్
X

దిశ, నిజామాబాద్: ప్రజల సంక్షేమం కోసం నిర్దేశించిన లక్ష్యాలు సాధించని వైద్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని జనహిత హాలులో వైద్యాధికారులతో కలిసి గర్భిణుల నమోదు, వ్యాధి నిరోధక టీకాల విషయంపై ఆరోగ్య కేంద్రాల వారీగా శనివారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వైద్యాధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే విధుల్లో నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలోనే అయ్యేలా చూడాలని కోరారు. నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడవలసిన బాధ్యత వైద్యాధికారులపై ఉందన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోతురే, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్, వైద్యులు పాల్గొన్నారు.

Tags: Kamareddy,collector,sharath,review meetin,Doctor’

Next Story

Most Viewed