దిశ ఎఫెక్ట్.. అక్రమ తవ్వకాలపై కలెక్టర్ సీరియస్

by  |
దిశ ఎఫెక్ట్.. అక్రమ తవ్వకాలపై కలెక్టర్ సీరియస్
X

దిశ‌, వెంక‌టాపురం: ఏజెన్సీలో అక్ర‌మ త‌వ్వ‌కాలపై ములుగు జిల్లా క‌లెక్ట‌ర్ సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు స‌మాచారం. మంగ‌ళ‌వారం దిశ పత్రిక‌లో త‌వ్వుకొ.దోచుకో ,ఏజెన్సీలో కంక‌ర‌, గోదావ‌రి న‌ది నుంచి ఇసుక అక్ర‌మ ర‌వాణా అనే క‌ధ‌నం ప్ర‌చురితమైన విష‌యం విధిత‌మే. ములుగు క‌లెక్ట‌ర్ కృష్ణ ఆదిత్య ఏజెన్సీలో అక్ర‌మ త‌వ్వ‌కాలపై స్దానిక రెవెన్యూ అధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్న‌ట్లు స‌మాచారం. మంగ‌ళ‌వారం అక్ర‌మంగా గోదావ‌రి న‌ది నుంచి ఇసుక త‌ర‌లిస్తున్న రెండు ట్రాక్ట‌ర్‌ల‌ను స్దానిక రెవెన్యూ కార్యాల‌యానికి త‌ర‌లించారు.

గోదావ‌రి న‌ది నుంచి ఇసుక అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డుతున్న ట్రాక్ట‌ర్ య‌జ‌మానుల‌తో స్దానిక రెవెన్యూ కార్యాల‌యంలో స‌మావేశం ఏర్పాటు చేశారు. అనుమ‌తులు లేకుండా గోదావ‌రి న‌ది నుంచి ఇసుక ర‌వాణా చేస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కాగా బుధవారం త‌హ‌సీల్దారు ఎ. నాగ‌రాజు, రెవెన్యూ ఇన్స్ పెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు, వీఆర్‌వో స‌ర్వేశ్వ‌ర‌రావులు, మండ‌ల ప‌రిధిలోని మ‌రికాల‌, బెస్త‌గుడెం, ఇటుక బ‌ట్టీలు, మంగ‌పేట‌గోదావ‌రి రేవు, కుక్క‌తొ్ర్రేవాగు స‌మీపంలోని గోదావ‌రి న‌ది పాయ‌ల‌ను ప‌రిశీలించారు



Next Story

Most Viewed