వరంగల్‌లో పటిష్టంగా ఇంటింటి సర్వే

by  |

దిశ, వరంగల్: కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే పటిష్టంగా చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఎవరికి కూడా కరోనా లక్షణాలు లేనట్లు తెలిసిందన్నారు. కొన్ని జిల్లాలో సిమ్‌టమ్స్ లేకున్నా పలువురికి పాజిటివ్ రిపోర్ట్ వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరినీ తప్పని సరిగా పరీక్షించి గుర్తించాలన్నారు. సర్వేలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఖచ్చితమైన రిపోర్ట్ ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. భవిష్యత్‌లో ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి పాజిటివ్ కేసులు నమోదైన పక్షంలో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Tags: collector Rajiv Gandhi Hanuman, meeting, medical officers, warangal

Next Story

Most Viewed