ప్రొటోకాల్‌ సమస్య రానివ్వకండి.. కలెక్టర్ సూచన

by  |
Collector Harish
X

దిశ, కొత్తగూడెం: బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా ప్రజలకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, వైరా నియోజకవర్గాల పరిధిలోని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం కోసం అధికారులను నియమించారు. చీరల పంపిణీలో ప్రొటోకాల్ సమస్య రాకుండా చూసుకోవాలని తెలిపారు. జిల్లాలోని అశ్వారావుపేటకు 57 వేలు, భద్రాచలానికి 39 వేలు, కొత్తగూడానికి 78 వేలు, పినపాకు 1000, వైరా నియోజకవర్గ పరిధిలోని జూలూరుపాడుకు 10 వేలు, ఇల్లందుకు 40 వేలు, మొత్తం రెండు లక్షల 55 వేల చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

అర్హులను ఎంపిక చేయడానికి గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, రేషన్ డీలర్, అంగన్వాడీ, ఐకేపీ సీసీలు, మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈవో, ఐకేజీ ఏపీఎంలతో కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రొటోకాల్ పాటిస్తూ చీరలు పంపిణీ చేయాలని సూచించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు పండుగను ఘనంగా జరుపుకోవాలనే ఆకాంక్షతోనే సీఎం కేసీఆర్ బతుకమ్మ కానుకగా ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

Next Story

Most Viewed