కలెక్టర్ ఎస్కార్ట్ వాహనం బోల్తా

by  |
కలెక్టర్ ఎస్కార్ట్ వాహనం బోల్తా
X

దిశ, కామారెడ్డి : జిల్లా కలెక్టర్ శరత్ ఎస్కార్ట్ వాహనం బోల్తాపడి నలుగురికి గాయాలయ్యాయి. సోమవారం సాయంత్రం క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వెళ్ళడానికి కలెక్టర్ శరత్ వాహనంతో పాటు ఆయన ఎస్కార్ట్ వాహనం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరింది. కలెక్టర్ వాహనం ముందు వెళ్లపోగా ఎస్కార్ట్ వాహనము వెనక నుంచి వస్తోంది. క్యాంపు కార్యాలయం నుంచి గుమస్తా కాలనీ వెళ్లే దారిలో నూతన రోడ్డు పనులు జరుగుతున్నాయి. రహదారి ఎత్తు పెరగింది.

ఎస్కార్ట్ వాహనం ఒక్కసారిగా పల్టీ కొడుతూ రోడ్డు కిందికి దూసుకుపోయింది. దాంతో వాహనంలో ఉన్న ఇద్దరు గన్ మెన్ లు, వి.ఆర్.ఏ బాల కుమార్, డ్రైవర్ స్వామిలకు గాయాలయ్యాయి. దాంతో నలుగురిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇందులో డ్రైవర్ కు తలకు తీవ్ర గాయాలు కాగా గన్ మెన్లు, విఆర్ ఏ కు స్వల్ప గాయాలయ్యాయి.

Next Story