ప్రతి గింజను కొంటాం.. రైతులకు కలెక్టర్ హామీ

by  |
ప్రతి గింజను కొంటాం.. రైతులకు కలెక్టర్ హామీ
X

దిశ, కాటారం: ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడవద్దంటూ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. సోమవారం కాటారం మండలంలో నిర్వహించిన రైతు అవగాహన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రబీ సీజన్‌లో రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని, వరి పంట వేసినా కొనుగోలు కేంద్రాలు మాత్రం ఉండవన్నారు. అందుకే రైతులు లాభదాయకమైన మినుములు, పెసర, ఇతర ఆరు తడి పంటలు వేయాలని కలెక్టర్ సూచించారు.



Next Story

Most Viewed