మూడు నెలలుగా సహజీవనం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

by srinivas |   ( Updated:2021-12-15 06:45:48.0  )
మూడు నెలలుగా సహజీవనం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
X

దిశ, ఏపీ బ్యూరో: ఆ ఇద్దరూ మూడు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. అయితే రెండు రోజులుగా ఆ ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో భరించలేని ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ రూరల్ మండలం గూడవల్లిలో.. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన కంచర్ల అహల్య(22) ఓ యువకుడితో మూడు నెలలుగా సహజీవనం చేస్తుంది. అయితే రెండు రోజులుగా ఇరువురి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. అయితే సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అహల్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అహల్యతో కలిసి సహజీవనం చేస్తున్న యువకుడి కోసం గాలిస్తున్నారు.

సెక్స్ గురించి తెలుసుకునేందుకు 11 ఏళ్లకే పోర్న్ వీడియోలు చూశా : స్టార్ సింగర్



Next Story

Most Viewed