తగ్గిన బొగ్గు!

by  |
తగ్గిన బొగ్గు!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియన్ పోర్ట్స్ అసోషియేషన్ నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్య దేశంలోని 12 ప్రధాన ఓడరేవులలో థర్మల్ బొగ్గు దిగుమతులు 14.98 శాతం తగ్గి 74.60 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. కేంద్రం అధీనంలోని ఈ ఓడరేవులు అంతకుముందు ఏడాది కాలంలో 87.74 మిలియన్ టన్నుల పొడి ఇంధనాన్ని కలిగి ఉండేవి. ఇదే ఆర్థిక సంవత్సరంలో ఇతర బొగ్గు దిగుమతులు 1.10 శాతం తగ్గి 47.08 మెట్రిక్ టన్నులుగా నమోదయ్యాయి. ఈ ఓడరేవులు గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో 46.57 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతులను కలిగి ఉండేవి.

విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం పొడి ఇంధనంపై ఆధారపడి ఉండటంతో థర్మల్ బొగ్గు ఇండియాలోని ఇంధన అవసరాలకు చాలా ముఖ్యమైనది. బొగ్గును ప్రధానంగా ఉక్కు తయారీకి ఉపయోగిస్తారు. చైనా, యూఎస్ తర్వాత ఇండియా మూడవ అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుగా ఉంది. ఇండియాలో 29.9 కోట్ల టన్నుల వనరులు, 12.3 కోట్ల టన్నుల నిరూపించబడిన నిల్వలు ఉన్నాయి. ఇది సుమారు 100 సంవత్సరాలకు సరిపడా ఉపయోగపడతాయి. ఇండియాలో 12 ప్రధానమైన ఓడరేవులున్నాయి. ముంబై, కండ్లా, జేఎన్‌పీటీ, మర్ముగావ్, న్యూ మంగళూరు, కొచ్చిన్, చెన్నై, కామరాజర్, వీఓ చిదంబర్నర్, విశాఖపట్నం, పారాదీప్, కోల్‌కతాల్లో మొత్తం సరుకులో 61 శాతం ఇక్కడే ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి కాలంలో ఈ ఓడరేవులు మొత్తం కార్గో వాల్యూమ్‌లో 585.72 మిలియన్ టన్నులతో స్వల్పంగా 1.14 శాతం వృద్ధిని సాధించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఈ ఓడరేవులు 579.10 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించాయి.

థర్మల్ బొగ్గు ఎగుమతుల నిర్వహణ 14.98 శాతం తగ్గి 74.60 మిలియన్ టన్నులకు చేరుకోగా, ఇనుప ఖనిజం 39.02 శాతం తగ్గి 45.05 మెట్రిక్ టన్నులకు చేరుకుందని ఇండియన్ పోర్ట్స్ అసోషియేషన్ తెలిపింది. 12 పోర్టులు గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి కాలంలో 32.37 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని నిర్వహించాయి. ఇక ఎరువుల పరిమాణం ఈ ఆర్థిక సంవత్సరం 21.55 శాతం పెరిగాయి, కానీ, ముడి ఎరువులు 2.80 శాతం తగ్గాయి.

గణాంకాల ప్రకారం… 2019-20 ఏప్రిల్-జనవరిలో దీన్‌దయాళ్ పోర్ట్ అత్యధికంగా 101.96 మిలియన్ టన్నులను నిర్వహిస్తోంది. తర్వాత పారాదీప్ 93.38 మిలియన్ టన్నులు, విశాఖపట్నం 60.73 మిలియన్ టన్నులు, జేఎన్‌పీటీ 56.64 మిలియన్ టన్నులు, కోల్‌కతా 53 మిలియన్ టన్నులు, ముంబై 51.34 మిలియన్ టన్నులను కలిగి ఉన్నాయి. చెన్నై ఓడరేవు 39.80 మిలియన్ టన్నులను నిర్వహిస్తుండగా, న్యూ మంగళూరు 30.91 మిలియన్ టన్నులను నిర్వహిస్తున్నాయి.

Read also..

ఇండియాలో పేటెంట్ పొందడం కష్టమా!?

Next Story