ఆ యాప్ ద్వారా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

by  |
ఆ యాప్ ద్వారా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కరోనా కారణంగా కో-ఆప్షన్ ఎన్నికలను జూమ్ యాప్ ద్వారా నిర్వహించి, నూతన శకానికి తెరదీశారు. ఆన్ లైన్ క్లాస్‌లు, ఆన్ లైన్ సమావేశాలకు వేదికైన జూమ్ యాప్ ద్వాకా కో-ఆప్షన్ ఎన్నికలను నిర్వహించారు.

శుక్రవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఐదు కో-ఆప్షన్ ఎన్నికలకు జూమ్ యాప్‌లో ఎన్నికలను కమిషనర్ జితేష్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 60 మంది సభ్యులు ఉన్న కార్పొరేషన్‌లో 24 మంది బీజేపీ కార్పొరేటర్లు ఉండగా వారికి సంబంధించిన నలుగురు ఇతర కార్పొరేటర్లను అధికార పార్టీ కోనుగోలు చేసి ఎన్నికలకు పోయారని బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. కాగా అంతలోనే ఎన్నికలను నిర్వహించడం గమనార్హం.

12 మంది బరిలో ఉండగా టీఆర్ఎస్ పార్టీ తన మిత్రపక్షమైన మజ్లిస్ కార్పొరేటర్ల సాయంతో టీఆర్ఎస్‌కు చెందిన మాజీ కార్పొరేటర్లు దారం సాయిలు, అంతరెడ్డి లత, చంద్రకళాలతో పాటు మజ్లిస్ పార్టీ తరపున మహ్మద్ ముజీబ్, ఇర్ఫానా బేగంలను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగర మేయర్ దండు నీతు కిరణ్ సైతం జూమ్ యాప్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Next Story