కరోనాకు భయపడొద్దు : సీఎం యడ్యూరప్ప

by  |
కరోనాకు భయపడొద్దు : సీఎం యడ్యూరప్ప
X

దిశ, వెబ్‌డెస్క్ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్ణాటక సీఎం ఎడియూరప్ప రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కరోనాకు ప్రజలు భయపడొద్దని సీఎం పిలుపునిచ్చారు. అభివృధ్ది మంత్రంతో ఈ మహమ్మారిని తరమేసి ‘సంక్షేమ రాష్ట్రం’గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఇటీవల తాను కూడా కరోనా బారిన పడగా.. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నానని వివరించారు. కరోనాతో ప్రజలు ఆందోళన చెందకండి.. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది.లక్షలాది ప్రజలు వైరస్ బారిన పడి కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రాణాంతక వైరస్ ఆరోగ్య రంగాన్నే కాక, పరిశ్రమల రంగాన్ని కూడా దెబ్బతీసిందని, లాక్ డౌన్ వలన సాధారణ, మధ్యతరగతి ప్రజలకు కోలుకోని విధంగా దెబ్బపడిందన్నారు.దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని.. రికవరీ రేటు కూడా పెరుగిందని గుర్తుచేశారు.

అభివృధ్దితో కూడిన ‘కల్యాణ కర్నాటక’ను తీర్చిదిద్దడమే తన అభిమతమని సీఎం స్పష్టంచేశారు.విపత్కర పరిస్థితుల్లో నిరంతం విధులు నిర్వహిస్తున్న కొవిడ్ వారియర్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే కరోనా వైరస్‌కు వ్యాక్సీన్ రాబోతోందని, అందువల్ల ఎవరూ ఆందోళన చెందవద్దని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed