తమిళ ప్రజలకు సీఎం పళనీ స్వామి సంక్రాంతి గిఫ్ట్

by  |
తమిళ ప్రజలకు సీఎం పళనీ స్వామి సంక్రాంతి గిఫ్ట్
X

దిశ,వెబ్ డెస్క్: తమిళ ప్రజలకు సీఎం పళనీ స్వామి సంక్రాంతి కానుక ఇవ్వనున్నారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుమారు 2.6 కోట్ల మంది పేదలకు కిట్ రూపంలో సంక్రాంతి కానుకలను ఇవ్వనున్నట్టు సీఎం పళనీ స్వామి వెల్లడించారు. సంక్రాంతి కిట్‌లో రూ. 2,500 లను, బియ్యం, పంచదార, చెరకు గడ, ఎండు ద్రాక్ష, జీడిపప్పుతో ఇతర వస్తువులను ఉంటాయని పేర్కొన్నారు. కిట్‌ను వచ్చే ఏడాది జనవరి 4 నుంచి రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.

Next Story

Most Viewed