సుప్రీంకు వెళ్దామా.?

by  |
సుప్రీంకు వెళ్దామా.?
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. కోర్టు నుంచి కాపీ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోనుంది. గురువారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా ప్రభుత్వానికి అందలేదు. అందిన తర్వాత దానిపై కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లడమా.? లేని పక్షంలో తగు విధమైన విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా.? అనే అంశంపై రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

పదవులే లక్ష్యంగా కప్పదూకుడు

Next Story

Most Viewed