ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాగుతోంది: కేసీఆర్

by  |
ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాగుతోంది: కేసీఆర్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి కొనసాగుతోందని, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పునరంకితమవుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రగతిభవన్‌లో జాతీయజెండా ఆవిష్కరించారు. తెలంగాణ వస్తే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి రైతుల పరిస్థితి దారుణంగా ఉండేదని, నేడు తెలంగాణలో వ్యవసాయం అగ్రగామిగా ఉందన్నారు. ఎండాకాలం వస్తే ప్రజలు మంచినీళ్ల కోసం గోస పడేవారని, ఇప్పుడు మిషన్‌ భగీరథతో నీటి సమస్య తీరిందన్నారు. విద్యుత్‌, సాగునీరు, విద్య, వైద్య, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని పేర్కొన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు.



Next Story

Most Viewed