రిజిస్ట్రేషన్లు రేపటి నుంచే: కేసీఆర్

by  |
రిజిస్ట్రేషన్లు రేపటి నుంచే: కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రేపటి నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాగా, ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన LRSను రద్దు చేయాలని కోరుతూ పలువురు హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఇన్ని రోజులు భూమి, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

అయితే, హైకోర్టు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అనుమతులిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. కేవలం వ్యవసాయేతర భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేపట్టాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజిస్ట్రేషన్ల కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనకు హైకోర్టు అంగీకారం తెలిపింది. దీంతో రేపటి నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేపట్టాలని సీఎం నిర్ణయించారు.

Next Story

Most Viewed