ఆధునిక సాగు పద్ధతులు అవసరం.. ఇజ్రాయిల్ వెళ్లి రండి : కేసీఆర్

108

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ సాగు విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయంలో ఆధునిక సాగు పద్ధతులను అవలంభించాలని సంబంధిత వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆధునిక సాగు పద్ధతుల అధ్యయనం కోసం ఇజ్రాయిల్‌లో పర్యటించాలని చెప్పారు. రాష్ట్రంలో పప్పుదినుసులు, నూనెగింజల సాగును ప్రోత్సహించాలని సీఎం కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా పప్పుదినుసులు, నూనెగింజలు సాగు చేసే ప్రాంతాల్లో దాల్ మిల్లులు, ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

అదేవిధంగా ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని, మార్కెట్లలో ట్రేడింగ్ లైసెన్స్ జారీ సులభతరంగా ఉండాలని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు వేదికలను కూడా వెంటనే అమల్లోకి తీసుకురావాలని, గ్రామీణ ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. రైతు వేదికలను మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..