బిగ్ బ్రేకింగ్ న్యూస్.. రైతులకు సీఎం కేసీఆర్ భారీ గుడ్ న్యూస్

by Anukaran |   ( Updated:2021-12-17 07:47:41.0  )
బిగ్ బ్రేకింగ్ న్యూస్.. రైతులకు సీఎం కేసీఆర్ భారీ  గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ తెలిపారు. రైతులందరికీ రైతుబంధు అందిస్తామని తెలిపారు. రైతుబంధు ఎట్టిపరిస్థితుల్లో ఆపేది లేదని స్పష్టం చేశారు. వరి పంట వేసిన రైతులకు రైతుబంధు ఇవ్వకూడదనే ప్రతిపాదనను అధికారులు కేసీఆర్ ముందు ఉంచారు. అయితే అధికారుల ప్రతిపాదనను సీఎం కేసీఆర్ తిరస్కరించారు. వరి వేసిన వారికి కూడా రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించారు.

తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో అధికారుల ప్రతిపాదనపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ చర్చించారు. అనంతరం అధికారుల సూచనను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వరి ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టిన కేసీఆర్.. బీజేపీతో చావో రేవో తేల్చుకుందామని చెప్పారు.

Next Story