ప్రైవేట్ టీచర్లకు మద్దతుగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..

88

దిశ, వెబ్‌డెస్క్ : కరోనాతో రాష్ట్రంలోని విద్యాలయాలు మూతబడిన విషయం తెలిసిందే. దీంతో ప్రైవేట్ టీచర్లకు జీతం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరైతే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ టీచర్లకు భరోసా కల్పించేందుకు గురువారం కీలక ప్రకటన చేశారు. గుర్తింపు పొందిన ప్రైవేటు ఉపాధ్యాయులకు రూ.2వేల నగదు ప్రోత్సహకంతో పాటు 25కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయంతో తెలంగాణలోని లక్షా 45వేల మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి లబ్ధి చేకూరనుందని ప్రకటించారు. బ్యాంక్ అకౌంట్, ఇతర వివరాలతో కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రేషన్ షాపుల ద్వారా 25కిలోల బియ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాలని ఆర్థిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..