లీకైన సీఎం కేసీఆర్ ఆడియో క్లిప్.. 22న కీలక ప్రకటన

by  |
లీకైన సీఎం కేసీఆర్ ఆడియో క్లిప్.. 22న కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించిన ఆడియో క్లిప్ (కింద ఉంది మీరు కూడా ఆడియో వినవచ్చు) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ ఆడియో క్లిప్ సంభాషణ ప్రకారం.. సీఎం కేసీఆర్ ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి వెళ్లనున్నారు. ఆరోజునే కేసీఆర్.. వాసాలమర్రిని దత్తత తీసుకోనున్నారు. దత్తత తీసుకునే నేపథ్యంలో సీఎం కేసీఆర్.. వాసాలమర్రి సర్పంచ్ పోగుల ఆంజనేయులుకి ఫోన్ చేసి మాట్లాడారు. తాను దత్తత తీసుకుంటున్నట్లు కేసీఆర్ ​ప్రకటించగానే.. జిల్లా కలెక్టర్, అధికారులు సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక సైతం రూపొందిస్తున్నటు సమాచారం. ఈ క్రమంలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్ గ్రామానికి ఏవైనా హామీలు ఇస్తారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed