మెగాస్టార్ చిరంజీవికి జగన్ థ్యాంక్స్

by  |
మెగాస్టార్ చిరంజీవికి జగన్ థ్యాంక్స్
X

దిశ, ఏపీ బ్యూరో: మెగాస్టార్ చిరంజీవికి సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సినేషన్ మెగాడ్రైవ్ పై ఏపీ ప్రభుత్వాన్ని మీరు ప్రశంసించడం చాలా అభినందనీయమన్నారు. ప్రభుత్వ కృషికి మీరిచ్చిన కితాబుకు ప్రభుత్వం తరపున ధన్యవాదాలు చెప్తున్నానంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. అయితే మీ అభినందనలు, ప్రశంసలు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ దక్కుతాయన్నారు. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంలో గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఏఎన్‌మ్‌లు, ఆశావర్కర్లు, పీహెచ్‌సీ డాక్టర్లు, మండల అధికారులు, జిల్లా అధికారులు, జేసీ, కలెక్టర్లదే కీలక పాత్ర అని సీఎం జగన్ కొనియాడారు.

ఒకే రోజు ఏపీలో 13.72 లక్షల కరోనా వ్యాక్సిన్లను ఏపీ ప్రభుత్వం వేసిన సందర్భంగా చిరంజీవి ప్రశంసలు కురిపించిన సంగతి తెలిపిందే. కరోనాను ఎదుర్కొనే క్రమంలో ముఖ్యమంత్రి కృషి అందరిలో విశ్వాసాన్ని పెంచుతోందని ప్రశంసించారు. జగన్ నాయకత్వం స్ఫూర్తిదాయకమని చిరంజీవి అభినందించారు.

Next Story

Most Viewed