కరోనా పరిస్థితులపై ప్రధానితో సీఎం ఏమన్నారంటే

by  |
కరోనా పరిస్థితులపై ప్రధానితో సీఎం ఏమన్నారంటే
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనాను నిరోధించేందుకు చేపడుతున్న చర్యల గురించి ​ ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ తెలియజేశారు. అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్​ను మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం జగన్​ మాట్లాడుతూ…. రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం వల్ల పాజిటివ్​కేసులు గణనీయంగా తగ్గినట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్ వస్తే ముందుగా ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు ఇవ్వాలని సీఎం సూచించారు.

ప్రజల్లో సరైన అవగాహన కల్పించడం, ముందస్తు జాగ్ర్తత్తలు తీసుకోవడంలో రాష్ర్ట ప్రజలను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత శుభ్రత, కోవిడ్​ వైరస్​ను నిరోధించే జీవన శైలికి ప్రజలు అలవాటు పడినట్లు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని రాష్ర్టాల్లో సెకండ్​వేవ్​ కొనసాగుతున్నందున తగు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ కోరారు.


Next Story

Most Viewed