క్లాట్‌-2021 నోటిఫికేషన్ విడుదల

by  |
క్లాట్‌-2021 నోటిఫికేషన్ విడుదల
X

బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివ‌ర్సిటీ ఆధ్వర్యంలోని క‌న్సార్టియం ఆఫ్ నేష‌నల్ లా యూనివ‌ర్సిటీస్, 2021 అక‌డ‌మిక్ ఇయ‌ర్‌కుగాను లా విశ్వవిద్యాల‌యాల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది నిర్వహించే కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్(క్లాట్‌)-2021 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్‌-2021
– జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్టియం ఆగస్టు 19, 2017న దేశంలో న్యాయ విద్యా ప్రమాణాలను, న్యాయ విద్య ద్వారా న్యాయ వ్యవస్థను మెరుగుపరచాలనే లక్ష్యంతో స్థాపించారు.
– దేశంలో న్యాయ విద్య అత్యున్నత ప్రమాణాలను సాధించడానికి జాతీయ న్యాయ పాఠశాలల మధ్య సమన్వయాన్ని సులభతరం చేయాలని కన్సార్టియం కోరుకుంటుంది. 21 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు కన్సార్టియంలో వ్యవస్థాపక సభ్యులుగా చేరారు.

అండ‌ర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం(ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం(ఎల్ఎల్ఎం డిగ్రీ)
అర్హత‌: అండ‌ర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం(ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ – ఐదేళ్ల కోర్సు): ఇంట‌ర్మీడియ‌ట్(10+2) ఉత్తీర్ణత‌. జ‌న‌ర‌ల్ అభ్యర్థులు 10+2లో క‌నీసం 45శాతం, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 40శాతం మార్కులు సాధించి ఉండాలి. మార్చి/ ఏప్రిల్, 2021లో క్వాలిఫైయింగ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కూడా క్లాట్-2021 పరీక్షకు హాజరు కావడానికి అర్హులు.

పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం(ఎల్ఎల్ఎం డిగ్రీ – ఏడాది కోర్సు): ఎల్ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణత‌. జ‌న‌ర‌ల్ అభ్యర్థులు డిగ్రీలో క‌నీసం 50శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 45శాతం మార్కులు సాధించి ఉండాలి. ఏప్రిల్/ మే 2021లో క్వాలిఫైయింగ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

గ‌మ‌నిక‌: క్లాట్ ప‌రీక్ష రాయ‌డానికి ఎలాంటి గ‌రిష్ఠ వ‌యోప‌రిమితి(No upper age limit) లేదు.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.4000(ఎస్సీ/ఎస్టీల‌కు రూ.3000)
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష ద్వారా
ద‌ర‌ఖాస్తు: ఆన్‌‌లైన్‌లో
చివ‌రితేది: 31 మార్చి, 2021
క్లాట్ ప‌రీక్ష తేదీ: 13 జూన్ 2021
వెబ్‌సైట్‌: https://consortiumofnlus.ac.in/clat-2021


Next Story