శివాజీ జయంతి వేడుకల్లో ఘర్షణ

by  |
శివాజీ జయంతి వేడుకల్లో ఘర్షణ
X

నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన శివాజీ జయంతి వేడుకల్లో టీఆర్ఎస్-బీజేపీల మధ్య ఘర్షణ చెలరేగింది. మంచిర్యాల చౌరస్తాలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. కాగా, ప్రారంభోత్సవానికి ముందు విగ్రహంపై అధికార పార్టీ రంగు గల గులాబీ వస్త్రాన్ని కప్పారు. ఈ ఘటనపై బీజేపీ, హిందూ వాహిని, బజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ విగ్రహం ఆవిష్కరణను టీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని హిందూ సంఘాల నేతలు ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, బీజేపీ నేతలు రావుల రామనాథ్, అన్నగారి భూమయ్యల నడుమ వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను అదుపులోకి తెచ్చారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విగ్రహావిష్కరణ చేశారు.


Next Story

Most Viewed