సమాజంలోని మార్పులే స్ఫూర్తి

by  |
సమాజంలోని మార్పులే స్ఫూర్తి
X

ప్రతి రోజూ న్యూస్ పేపర్లు చదువుతానని.. రెండోసారి ప్రయత్నంలోనే సివిల్స్‌కు ఎంపికయ్యాయని కేసారపు ప్రేమ్ సాగర్ రెడ్డి చెప్తున్నారు. మంగళవారం వెలువడిన సివిల్ ఫలితాల్లో జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన ప్రేమ్ సాగర్ రెడ్డి 170 ర్యాంకు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలే తనను సివిల్ సర్వీసెస్ వైపు వెళ్లేలా ప్రేరేపించాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ‘దిశ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..

దిశ, పాలకుర్తి

దిశ: మీకు స్ఫూర్తి ఎవరు?

ప్రేమ్: మా కుటుంబలో పెద్దగా చదువు కున్న వాళ్లు లేరు. అందువల్ల నాకు సివిల్ రాయాలని ఎవరూ చెప్పలేదు. నేను ప్రతీరోజూ న్యూస్ పేపర్స్ చదువుతా. సమాజంలో జరుగుతున్న పరిణామాలు, నిరుపేదలు ఎదుర్కొంటున్న స మస్యలు బాధించేవి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని నా వంతుగా సమాజానికి సేవ చేయలనే ఉద్దేశంతో సివిల్స్ మార్గాన్ని ఎంచుకున్నా. ఎన్నిసార్లు సివిల్ ఎగ్జామ్స్ రాశారు? రెండుసార్లు రాశాను. 2018లో మెయిన్స్‌ వరకు వెళ్లాను. 2019లో రెండో ప్రయత్నంలో‌ మళ్లీ సివిల్స్ రాసి 170 ర్యాంకు సాధించా.

కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉందా?

అవును ఉంది. నేను సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించడానికి ప్రధాన కారణం కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే. అమ్మ, నాన్న, అక్క ఎంతగానో సపోర్ట్ చేశారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. దీంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కుటుంబ సభ్యులు మాత్రం ధైర్యం చెప్పి సహకారం అందించారు.

విద్యాభ్యాసం ఎక్కడ?

1 నుంచి 4వ తరగతి వరకు పాలకుర్తి విద్యాజ్యోతి ప్రైవేటు పాఠశాలలో చదివాను. 5 నుంచి 10 వరకు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లోని నవ భారత్ పబ్లిక్ స్కూల్లో చదివాను. ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్ చదవలేక నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చేరాను. మొదటి సంవత్సరం చదువుతున్న క్రమంలో వరంగల్ ప్రభుత్య కళాశాలకు బదిలీ అయ్యా. 2009లో డిప్లొమా పూర్తి చేశాను. ఈసెట్ రాసి ఘట్ కేసర్ శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో 2012లో ఇంజినీరింగ్ పూర్తి చేశా. క్యాంపస్ ప్లేస్‌మెంట్లో కన్విజంట్‌లో 5 ఏళ్లు ఉద్యోగం చేశాను. చివరి ఏడాదిలో సివిల్ వైపు అడుగు వేశాను. విజయం సాధించాను.

కుటుంబ నేపథ్యం?

మాది రెడ్డి సామాజిక వర్గం అయినప్పటికీ ఆర్థికంగా వెనకబడే ఉన్నాం. నాన్న టీవీ రిపేరు చేస్తారు. అమ్మ కూలీ పనులు చేస్తూ నన్ను, అక్కను చదివించారు. పాలకుర్తిలో షాప్ నడవక పోవడంతో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు షిఫ్ట్ అయ్యాం.

యువతకు మీరిచ్చే సందేశం?

కరోనా‌తో లాక్ డౌన్ వచ్చింది. ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి‌ మంచి అవకాశం. ఈ సమయంలో ఇంటి పట్టున ఉండి ప్రిపేర్ అయితే బాగుంటుంది. ప్రతి అంశాన్ని అనుకూలంగా మలుచుకొని చదివితే విజయం సొంతమవుతుంది.



Next Story

Most Viewed