ఆ కార‌ణంగానే దృశ్యం-3 తెలుగులో రావట్లేదు: డైరెక్టర్

by velandi.Saikiran |

హీరో ఇమేజ్ చెడిపోవ‌ద్ద‌న్న కార‌ణంగానే దృశ్యం-3 తెలుగులో రాలేద‌ని ద‌ర్శ‌కుడు క్లారిటీ ఇచ్చారు.

ఆ కార‌ణంగానే దృశ్యం-3 తెలుగులో రావట్లేదు: డైరెక్టర్
X

దిశ‌, వెబ్ డెస్క్: ‘దృశ్యం’ మొదటి రెండు పార్ట్స్ బంపర్ హిట్ అయిన నేపథ్యంలో లేటెస్ట్ గా వచ్చిన ‘దృశ్యం3’ కూడా కలెక్షన్స్ వర్షం కురిపించింది. అయితే మొదటి రెండు సినిమాలు తెలుగు వెర్షన్ లో రాగా.. విక్టరీ వెంకటేష్ హీరోగా చేశారు. అయితే ‘దృశ్యం3’లో మాత్రం నేరుగా మోహన్ లాల్ తో మామ అనిపించారు. ఇది ఇలా ఉండగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం3’ తెలుగులో రీమేక్ కాకపోవడంపైన దర్శకుడు జీతూ జోసెఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రీమేక్ హిందీలో మాత్రమే వస్తోందని చెప్పారు. ఇతర భాషల్లో ఉన్న హీరోల ఇమేజ్ దృష్ట్యా ప్రేక్షకులకు ఈ సినిమా క్లైమాక్స్ నచ్చబోదని కీలక విషయాలను పంచుకున్నారు.

అదే హిందీలో ఇప్పటికే రైట్స్ తీసుకున్నప్పటికీ, మేకర్స్ తాము క్లైమాక్స్ మార్చుకుంటామని మర్యాద పూర్వకంగా అడిగినట్లు గుర్తు చేశారు. దానికి తాము ఓకే చెప్పామని వివరించారు. కానీ ఇతర భాషల్లో ఉన్న హీరోల ఇమేజ్ దృష్ట్యా తెలుగు, క‌న్న‌డ‌లో రీమేక్ చేయలేకపోయామని తెలిపారు. అంటే ఈ సినిమా కోసం దర్శకుడు జోసెఫ్ రాసుకున్న క్లైమాక్స్ తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు అన్న‌మాట. ఒకవేళ ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటించి ఉంటే..తెలుగు అభిమానులు తన క్లైమాక్స్ ఇష్టపడబోరని చెప్పే ప్రయత్నం చేశారు జోసెఫ్‌. అందుకే మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేసినట్లు స్పష్టం చేశారు.

Next Story