సినిమాలకు గుడ్ బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ.. అక్కడ స్థిరపడాలనుకుంటున్నా అంటూ షాకింగ్ కామెంట్స్!

by Mallepaka Hamsa |

నా పని చెన్నైలో ఉండటం వల్ల నేను ఇక్కడే ఉంటున్నాను. దానితో పాటు, సంగీతం ,నటన కూడా నా జీవితంలో భాగమే.

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ.. అక్కడ స్థిరపడాలనుకుంటున్నా అంటూ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ త్వరలో ‘నూరుసామి’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘బిచ్చగాడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు శశి దర్శకత్వంలో రాబోతోంది. హిట్ కాంబో రిపీట్ కాబోతుండటంతో ప్రేక్షకుల్లో ‘నూరుసామి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో విజయ్ సరసన స్వాసిక హీరోయిన్ నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకుని జూన్ 19న థియేటర్స్‌లోకి రాబోతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, విజయ్ ప్రమోషన్స్‌లో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను త్వరలోనే సినిమాలకు దూరం కాబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. ‘నూరుసామి’ చిత్రంలో మీరు ఒక రైతుగా నటించిన అనుభవం ఎలా ఉంది? అలాగే జీవన శైలి ఎలా ఉంటుందని యాంకర్ ప్రశ్నించగా.. విజయ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘‘నాకు నిజంగా ఇష్టమైనది సరళమైన జీవనశైలి. నా పని చెన్నైలో ఉండటం వల్ల నేను ఇక్కడే ఉంటున్నాను. దానితో పాటు, సంగీతం ,నటన కూడా నా జీవితంలో భాగమే. సాధారణమైన, ప్రశాంతమైన జీవనశైలిని నేను నిజంగా ఆస్వాదిస్తాను. పల్లెటూరిలో జీవించడం, సాయంత్రం 6 లేదా 7 గంటలకే నిద్రపోవడం, పక్షుల కిలకిలారావాలు, కోడిపుంజుల కూతలు వినడం ఇవే నాకు సంతోషాన్నిస్తాయి. నిజం చెప్పాలంటే, రాబోయే రెండు, మూడేళ్లలో నేను పొల్లాచి వంటి ప్రాంతంలో స్థిరపడే అవకాశం ఉంది. పల్లెటూరి జీవనశైలికి దగ్గరగా వెళ్లాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. అందుకే దానికి తగిన స్థలం కోసం వెతుకుతున్నాను. పొలం కొన్న తర్వాత అక్కడే సెటిల్ అవుతాను’’ అని అన్నారు. దీంతో విజయ్ ఆంటోనీ సినిమాలకు గుడ్ బై చెప్పి పల్లెటూరిలో పొలం పనులు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారని ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story