మొట్టమొదటిసారి అలాంటి పాత్రలో రజినీకాంత్.. వైరల్‌గా ఫొటోలు

by Chukka Sudharani |   (  Updated:2026-06-09 15:49:29  IST  )

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కమల్ హాసర్ నిర్మాణంలో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘తలైవార్ 173’.

మొట్టమొదటిసారి అలాంటి పాత్రలో రజినీకాంత్.. వైరల్‌గా ఫొటోలు
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కమల్ హాసర్ నిర్మాణంలో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘తలైవార్ 173’. ‘రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాలో రజినీకాంత్ మొట్టమొదటిసారి డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తాజాగా కోలీవుడ్ వర్గాల నుంచి ఓ వార్త వైరల్ అవుతున్నది. ఈ మేరకు ‘ఆర్కేఎఫ్ఐ కార్యాలయంలో ఫోటోషూట్ జరిగింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ జి. వెంకట్ రామ్ నిర్వహించిన ఈ ఫోటోషూట్‌లో రజనీకాంత్ పాల్గొన్నారు. ఆయన మెడలో 'ఎస్' గుర్తు ఉన్న స్టెతస్కోప్‌ను ధరించి ఫోటోలు దిగారు. ఇవి చూడటానికి ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నాయి’ అంటూ ఓ పోస్ట్ వైరల్ అవుతూ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే.. ‘చంద్రముఖి’ వంటి కొన్ని సినిమాల్లో ఆయనను డాక్టర్‌గా ప్రస్తావించినప్పటికీ.. తలైవార్‌లో పూర్తిస్థాయి డాక్టర్ పాత్రలో నటించడం ఇదే మొదటిసారి అని టాక్. ఇదొక కమర్షియల్ ఎంటర్‌టైనింగ్ చిత్రం అయినప్పటికీ.. చెన్నైలో బాగా ప్రాచుర్యం పొందిన '₹5 డాక్టర్' స్ఫూర్తిదాయక అంశాలను కలిగి ఉంటుంది. అలాగే, చాలా తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్సను అందించి ప్రజల నుండి అపారమైన ప్రశంసలు పొందిన పలువురు వైద్యుల జీవితాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుందని తెలుస్తుండగా.. అలాంటి ఓ డాక్టర్ పాత్రను రజినీకాంత్ పోషిస్తున్నట్లు సమాచారం. కాగా.. ఈ సినిమా డైరెక్టర్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.


Next Story