- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AA23పై సాలిడ్ అప్డేట్.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పటినుంచంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. కోలీవుడ్ స్టార్ అట్లీ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. అంతే కాకుండా.. ఇటీవల అల్లు అర్జున్ బర్త్‌డే స్పెషల్‌గా ‘రాకా’ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ రాగా.. సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంతో బిజీగా ఉన్న ఈ హీరో తన 23వ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. అల్లు అర్జున్ అండ్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్టు కోసం మే 25, 26 తేదీల్లో సమావేశమయ్యారు. అలాగే ఆ తర్వాత జూన్ మొదటి వారంలో మరోసారి భేటీ అయ్యారు. 'లియో' సహ-రచయిత రత్న కుమార్ ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ చేసే దశలో ఉండగా.. మరోవైపు, చిత్ర బృందంలోని ఒక విభాగం ఇప్పటికే లొకేషన్ పరిశీలన ప్రక్రియను పూర్తి చేసిందట. ఈ సినిమా కోసం ఎంపిక చేసిన కీలక ప్రదేశాలలో ఢిల్లీ కూడా ఒకటిగా ఉందని తెలుస్తోంది. రాక షూటింగ్ పూర్తయిన తర్వాత, అల్లు అర్జున్ తన పూర్తి దృష్టిని AA23 పైకి మళ్లించనున్నారని టాక్. అనుకున్నవి అనుకున్న టైమ్‌లో సెట్ అయితే త్వరలో ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారు మేకర్స్.






