సైఫ్ అలీఖాన్‌కు షాక్.. హైకోర్టు నిర్ణయంతో 15 వేల కోట్ల ఆస్తులు కోల్పోనున్న హీరో

by Mahesh |
సైఫ్ అలీఖాన్‌కు షాక్.. హైకోర్టు నిర్ణయంతో 15 వేల కోట్ల ఆస్తులు కోల్పోనున్న హీరో
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల బంగ్లాదేశ్‌కు చెందిన నిందితుడి కత్తి దాడిలో గాయపడిన బాలీవుడ్ స్టార్ హీరో(Bollywood star hero) సైఫ్ అలీఖాన్‌న (Saif Ali Khan) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. అయితే దుండగుడి దాడి నుంచి ప్రాణాలతో బయటపడి ఇంటికి చేరుకు సైఫ్ కు భారీ షాక్ తగిలింది. ఆయన కుటుంభానికి చెందిన రూ. 15 వేల కోట్ల ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకునేందుకు లైన్ క్లియర్ అయింది. వివరాల్లోకి వెళితే.. గతంలో కేంద్రం తీసుకొచ్చిన ఎనిమీ ప్రాపర్టీ చట్టం(Enemy Property Act) కింద పాక్ కు వలస వెళ్లిన వారి ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. నటుడు సైఫ్ పూర్వీకులు పటౌడీ ఫ్యామిలీ(Pataudi Family)కి చెందిన వారు కావడంతో వారికి భోపాల్ లో ఆస్తులు ఉన్నాయి.

అయితే ఈ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అప్పట్లో కేంద్రం ప్రయత్నించగా.. సైఫ్ అలీఖాన్ అతని తల్లి శర్మిష్ఠ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఇన్ని రోజులు సదరు ప్రాపర్టీ పై స్టే (Stay on property) విధిస్తూ వచ్చింది. తాజాగా ఈ రోజు మధ్యప్రదేశ్ హైకోర్టు(Madhya Pradesh High Court) పటౌడీ ఆస్తుల(Pataudi properties)పై ఉన్న స్టేను ఎత్తివేసింది. దీంతో పటౌడీ కుటుంబానికి చెందిన రూ. 15,000 కోట్లు ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో కేంద్రానికి ఎనిమీ ప్రాపర్టీ చట్టం కింద సదరు ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు లైన్ క్లియర్(line Clear) అయింది. కాగా మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయంతో హీరో సైఫ్ అలీఖాన్ కుటుంబం 15 వేల కోట్ల విలువగల ఆస్తులు కోల్పోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed