రూ.2400 కోట్ల భారీ స్కామ్‌లో చిక్కుకున్న సన్నీ లియోన్.. సీఐడీ నోటిసులు!

by Mallepaka Hamsa |

సన్నీ లియోన్ వివాదంలో చిక్కుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు హాట్ టాపిక్‌గా మారాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శివమ్ అసోసియేట్స్ భారీ కుంభకోణంలో సన్నీ లియోన్ పేరు బయటకు రావడం గమనార్హం.

రూ.2400 కోట్ల భారీ స్కామ్‌లో చిక్కుకున్న సన్నీ లియోన్.. సీఐడీ నోటిసులు!
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్‌‌కు తెలుగు, హిందీ సినిమాలతో మెప్పించిన ఈ భామ స్పెషల్ సాంగ్స్ కూడా చేసి ప్రేక్షకుల విశేషంగా ఆకట్టుకుంది. కానీ గత కొద్ది కాలంగా ఈ అమ్మడు ఎక్కువగా బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. అక్కడే వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సన్నీ లియోన్ వివాదంలో చిక్కుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు హాట్ టాపిక్‌గా మారాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శివమ్ అసోసియేట్స్ భారీ కుంభకోణంలో సన్నీ లియోన్ పేరు బయటకు రావడం గమనార్హం. రూ, 2400 కోట్ల భారీ ఫోంజి కుంభకోణంలో ఆమెకు సీఐడీ నోటిసులు జారీ చేసినట్లు సమాచారం. శివం అసోసియేట్స్ అనే సంస్థ కస్టమర్ల నుంచి అక్రమంగా రూ.2400 కోట్ల నగదు డిపాజిట్లను సేకరించిందనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సంస్థ యజమాని శివానంద నీలణ్ణవరపై గతంలోనే కేసులు నమోదయ్యాయి.

అయితే, ఈ అక్రమ సొమ్ముతో గతేడాది డిసెంబరులో నిర్వహించిన 'కన్నడ ఉత్సవం'లో పలువురు సినీ నటులు పాల్గొన్నట్లు సీఐడీ గుర్తించింది. ఈ వేడుకల్లో పాల్గొన్నందుకు గాను నటులకు పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంస్థ యజమాని 2023లో 'ఛాంపియన్' అనే సినిమా తీశారు. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ చేసినందుకు గాను నటి సన్నీ లియోన్‌కు ఏకంగా రూ. 1 కోటి పారితోషికం ఇచ్చినట్లు రికార్డుల్లో తేలింది. ప్రజల నుంచి వసూలు చేసిన అక్రమ సొమ్మునే ఆమెకు రెమ్యూనరేషన్‌గా ఇచ్చారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ తాజాగా ఆమెకు నోటీసులు కూడా పంపినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం సన్నీ లియోన్ మాత్రమే కాకుండా, గత డిసెంబర్‌లో ఈ సంస్థ నిర్వహించిన ఒక వేడుకలో పాల్గొన్న కన్నడ నటులు డాలి ధనుంజయ, సప్తమీ గౌడ, వశిష్ఠ సింహ, రాగిణి ద్వివేదిలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సి.ఐ.డి సిద్ధమైందనే వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Next Story