- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సన్నీ డియోల్ ‘లాహోర్-1947’ సినిమా టైటిల్ మార్పు.. విడుదల తేదీ ప్రకటిస్తూ ఆసక్తికర పోస్ట్
ద్వేషం, భయం ఉన్న రోజుల్లో అతను ధైర్యాన్ని ఎంచుకున్నాడు. ఆగస్టు 14, 2026న థియేటర్లలో ‘బట్వారా 1947’ చూడండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

దిశ, సినిమా: బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ ఇటీవల విడుదలైన ‘బోర్డర్-2’సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘లాహోర్-1947’. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి తెరకెక్కిస్తున్నాడు. నిజానికి ఈ సినిమాను బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవ టైటిల్ మారినట్లు గత కొద్ది కాలంగా వస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారానికి తెర దించుతూ, ఈ చిత్రానికి ‘బట్వారా 1947’ అనే కొత్త టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా, ఈ విషయాన్ని సన్నీ డియోల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను షేర్ చేయడంతో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు. "ద్వేషం, భయం ఉన్న రోజుల్లో అతను ధైర్యాన్ని ఎంచుకున్నాడు. ఆగస్టు 14, 2026న థియేటర్లలో ‘బట్వారా 1947’ చూడండి" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఈ సినిమా కథ ప్రకారం ‘లాహోర్ 1947’ కంటే ‘బట్వారా’ అనే టైటిల్ అయితేనే బాగుంటుందని అమీర్ ఖాన్ భావించారట. అయితే, ‘బట్వారా’ అనే టైటిల్ హక్కులు గతంలో దివంగత నిర్మాత సలీం అక్తర్ వద్ద ఉండేవి. దాంతో అమీర్ ఖాన్ స్వయంగా సలీం అక్తర్ కుటుంబాన్ని కలిసి, వారిని ఒప్పించి ఆ టైటిల్ హక్కులను సాధించినట్లు తెలుస్తోంది. అలా ఈ చిత్రం పేరు ‘బట్వారా 1947’గా మారింది. భారత విభజన నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సన్నీ డియోల్‌తో పాటు సీనియర్ నటి షబానా అజ్మీ, అలీ ఫజల్, సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా ఈ సినిమాతోనే మళ్లీ వెండితెరపైకి రీ-ఎంట్రీ ఇస్తుండడం విశేషం.






