7 ఏళ్ల తర్వాత హిట్ ఫ్రాంచైజీ సీక్వెల్‌తో రీఎంట్రీ ఇస్తున్న హాట్ బ్యూటీ.. వేట ఇప్పుడే మొదలైందంటూ మేకర్స్ ప్రకటన

by Mallepaka Hamsa |

ఇక ఇప్పుడు దాదాపు 7 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈషా గుప్తా మళ్లీ బిగ్ స్క్రీన్‌పై సెన్సేషన్ సృష్టించడానికి సిద్ధమైంది.

7 ఏళ్ల తర్వాత హిట్ ఫ్రాంచైజీ సీక్వెల్‌తో రీఎంట్రీ ఇస్తున్న హాట్ బ్యూటీ.. వేట ఇప్పుడే మొదలైందంటూ మేకర్స్ ప్రకటన
X

దిశ, సినిమా: బాలీవుడ్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఈషా గుప్తా అభిమానులకు సరికొత్త గుడ్ న్యూస్ వచ్చేసింది. అజయ్ దేవగన్‌తో కలిసి ఆమె నటించిన అడ్వెంచర్ కామెడీ చిత్రం ‘టోటల్ ధమాల్’ (ధమాల్-3) బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో తన గ్లామర్, యాక్టింగ్‌తో అలరించిన ఈషా, ఆ తర్వాత టాలీవుడ్‌లో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’లో స్పెషల్ సాంగ్‌తో రచ్చ చేసింది. అనంతరం ‘వన్ డే’ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో మెప్పించినప్పటికీ, 2019 తర్వాత ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు దాదాపు 7 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈషా గుప్తా మళ్లీ బిగ్ స్క్రీన్‌పై సెన్సేషన్ సృష్టించడానికి సిద్ధమైంది.

తాను గతంలో నటించిన సూపర్ హిట్ కామెడీ ఫ్రాంచైజీకి సీక్వెల్‌గా రాబోతున్న ‘ధమాల్ 4’ లోనే ఆమె నటిస్తుండడం విశేషం. ఈ చిత్రంతో ఈషా గుప్తా బాలీవుడ్‌లో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా, మూవీ మేకర్స్ ‘ధమాల్-4’ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే దర్శకుడు ఇంద్ర కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సరికొత్త సీక్వెల్‌ను అజయ్ దేవగన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఈషా గుప్తాతో పాటు రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సి, సంజయ్ మిశ్రా, సంజీదా షేక్, రవికిషన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘‘ఇప్పుడే వేట మొదలైంది’’ అంటూ మేకర్స్ వదిలిన పోస్టర్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇక ఈ సినిమాతో ఈషా గుప్తాను మళ్లీ వెండితెరపై చూడబోతున్నందుకు ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story