నా చావుకు ఎన్టీఆర్ కూడా వచ్చాడు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

‘పెద్ది’ తర్వాత వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్న జగపతి బాబు తన లైఫ్‌లో ఎదుర్కొన్న కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

నా చావుకు ఎన్టీఆర్ కూడా వచ్చాడు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: రీసెంట్‌గా వచ్చిన ‘పెద్ది’ చిత్రంలో ‘అప్పలసూరి’గా తన పర్ఫామెన్స్‌తో ప్రశంసలు అందుకుంటున్న సీనియర్ నటుడు జగపతి బాబు.. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీలో జాన్వీ కపూర్ పాత్రపై వస్తున్న విమర్శలపై ఆయన మాట్లాడుతూ.. ‘ఒకసారి మనం ఒక ప్రాజెక్టుపై సైన్ చేసిన తర్వాత.. నటీనటులు ఎవరైనా సరే డైరెక్టర్ ఏం చెబుతాబో అదే చెయ్యాలి. ఒక్కోసారి అవి వర్కౌట్ అవుతాయి. కొన్ని సార్లు వర్కౌట్ అవ్వవు. దానికి యాక్టర్స్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడం అస్సలు కరెక్ట్ కాదు’ అని తెలిపారు.

అలాగే.. ఆయన నిజ జీవితంలో ఎంత నిజాయితీగా జీవిస్తున్నారో వివరిస్తూ.. ‘స్క్రీన్‌పై నటిస్తున్నాను. బయట నిటిస్తూ బతకాల్సిన అవసరం నాకు లేదు. నిజానికి ‘జీవితంలో నేను అబద్ధం చెప్పలేదు’ అని ఎవరైనా చెబితే.. అదే పెద్ద అబద్ధం అవుతుంది. అయితే.. నిజం చెప్పి కూడా బతకొచ్చు అని నాకు అర్థమైంది. అందుకే నిజం దాటడం, ప్రతిదానికి అబద్ధం ఆడుతూ బతకాల్సిన అవసరం ఏముంది అని నిర్ణయించుకున్నాను. అప్పటినుంచే నిర్మోహమాటంగా మాట్లాడుతున్నా’ అని తెలిపారు. అలాగే బతికి ఉండగానే తను చనిపోయినట్లు వార్తలు సృష్టించడంపై జగపతి బాబు మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో నేను చనిపోయానంటూ తప్పుడు వార్తలు ప్రచారమైన సందర్భాలు కూడా ఉన్నాయి. నా మృతదేహం పక్కన తారక్‌తో పాటు ఇతర నటులు ఏడుస్తున్నట్లుగా ఉన్న ఎడిట్ చేసిన దృశ్యాలను కూడా వారు ప్రచారం చేశారు. కానీ అలాంటి వాటి గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. మరణించానని ప్రకటించినా... నిజాయితీతో జీవిస్తున్నాను’ అంటూ ఆయన స్టైల్‌లో చెప్పుకొచ్చాడు ఈ సీనియర్ నటుడు.

Next Story