samyuktha: నెట్టింట వైరలవుతోన్న జూనియర్ సమంత వితౌట్ మేకప్ పిక్స్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే?

by Kodari Anjali |   (  Updated:2025-04-28 15:27:28  IST  )

హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

samyuktha: నెట్టింట వైరలవుతోన్న జూనియర్ సమంత వితౌట్ మేకప్ పిక్స్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే?
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా.. కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా అవకాశం దక్కించుకుని మంచి పేరు సంపాదించుకుంది. కల్యాణ్ రామ్ సరసన బింబిసార సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన సంయుక్త మీనన్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మంచి చాన్స్‌లు అందుకుంటోంది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సరసన భీమ్లా నాయక సినిమాలో చాన్స్ కొట్టేసింది.

2022 లో కన్నడ మూవీ అయిన గాలిపట 2 సినిమాలో నటించి జనాల్ని మంత్రముగ్దుల్ని చేసిందనడంలో అతిశయోక్తిలేదు. అలాగే సంయుక్త మీనన్ తీవండి, లిల్లీ, జులై, ఓరు యమంన్ ప్రేమకథ, ఉయారే కల్కి, ఎదక్కడ్ బెటాలియన్ 06, అండర్ వరల్డ్, విరూపాక్ష, డెవిల్, రామ్ శర్వా, స్వయంభూ వంటి చిత్రాల్లో నటించి.. అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌లో అభిమానుల్ని అలరిస్తుంటుంది.

తాజాగా సంయుక్త మీనన్ లేటెస్ట్ ఫొటో షూట్ చేసింది. మేకప్ లేకుండా ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ జూనియర్ సమంత పెట్టుకున్న స్టైలిష్ ఈయర్ రింగ్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పోస్ట్ వీక్షించిన జనాలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వితౌట్ మేకప్ కూడా సంయుక్త లుకింగ్ గార్జియస్ అంటూ కొనియాడుతున్నారు. నైస్ ఫొటోస్.. అందంగా ఉన్నావంటూ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Next Story