- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
samyuktha: నెట్టింట వైరలవుతోన్న జూనియర్ సమంత పోస్ట్..
హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా.. కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా అవకాశం దక్కించుకుని మంచి పేరు సంపాదించుకుంది. కల్యాణ్ రామ్ సరసన బింబిసార సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన సంయుక్త మీనన్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మంచి చాన్సులు అందుకుంటోంది.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సరసన భీమ్లా నాయక్ సినిమాలో చాన్స్ కొట్టేసింది. 2022 లో కన్నడ మూవీ అయిన గాలిపట 2 సినిమాలో నటించి జనాల్ని మంత్రముగ్దుల్ని చేసిందనడంలో అతిశయోక్తిలేదు. అలాగే సంయుక్త మీనన్ తీవండి, లిల్లీ, జులై, ఓరు యమంన్ ప్రేమకథ, ఉయారే కల్కి, ఎదక్కడ్ బెటాలియన్ 06, అండర్ వరల్డ్, విరూపాక్ష, డెవిల్, రామ్ శర్వా, స్వయంభూ వంటి చిత్రాల్లో నటించి.. అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌తో అభిమానుల్ని అలరిస్తుంటుంది.
తాజాగా సంయుక్త మీనన్ లేటెస్ట్ ఫొటో షూట్ చేసింది. రెడ్ కలర్ చీర కట్టుకుని ఆకట్టుకునే ఫొటోలకు ఫోజులిచ్చింది. కనిపించి కనిపించని ఎద అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ అందమైన ఫోజులకు సంయుక్త మీనన్ ‘లాల్’ అని ఓ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు లవ్‌లీ కామెంట్లు పెడుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.






