- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్యూట్ స్మైల్‌తో కుర్రాళ్ల హృదయాల్ని కొల్లగొడుతోన్న సాయిధరమ్ బ్యూటీ..?
హీరోయిన్ సంయుక్త మీనన్ (Sanyuktha Menon) గురించి ప్రత్యేకంగా చెప్పాహీరోయిన్ సంయుక్త మీనన్ (Sanyuktha Menon) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.ల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ సంయుక్త మీనన్ (Sanyuktha Menon) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ‘పాప్‌కార్న్’ (Popcorn) అనే మలయాళ మూవీతో ఈ నటి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగు, కన్నడలో కూడా అవకాశాలు దక్కించుకుంది.2018 లో కలరి మూవీలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.
తర్వాత తెలుగులో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా నటించిన బింబిసార (Bimbisara) మూవీతో అడుగుపెట్టింది. తర్వాత భీమ్లా నాయక్(Bhimla Nayak)లో, 2022 లో కన్నడ మూవీ అయిన గాలిపట2 మూవీలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.
అలాగే సంయుక్త మీనన్.. తీవండి, లిల్లీ, కలరి, జులై కాత్రిల్ (July Catril), ఓరు యమందన్ ప్రేమకథ, ఉయారే, కల్కి, ఎదక్కడ్ బెటాలియన్ 06,అండర్ వరల్డ్, వెళ్లం: ది ఎస్సెంటియాల్ డ్రింక్, ఆనుమ్ పెన్నుమ్, వోల్ఫ్, ఎరిడ, భీమ్లా నాయక్, కడువా, బింబిసారా, విరూపాక్ష, డెవిల్, లవ్ మీ, మహారాగ్ని: క్వీన్ ఆఫ్ క్వీన్స్, స్వయంభూ, రామ్, శర్వా వంటి చిత్రాల్లో నటించింది.
ఇకపోతే ఈ బ్యూటీ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. దయం నైవేద్య విరామం టైంలో శ్రీవారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకుంది. దర్శనం తర్వాత సంయుక్త రంగనాయకులు మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా..
ఆలయ ఆధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో సంయుక్త మీనన్‌ను చూసిన అభిమానులు ఫొటోలకు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే ఈ నటి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ఆకట్టుకునే ఫొటోలతో పాటు ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘మీ జీవితంలో ప్రకాశవంతమైన రంగులు పెద్ద చిరునవ్వులు, కౌగిలింతలు చాలా ప్రేమ.. హ్యాపీ హోలీ.. అందరి ప్రేమకు ధన్యవాదాలు నాకు చాలా ఆనందంగా ఉంది’’ అంటూ సంయుక్త మీనన్ రాసుకొచ్చింది.
- Tags
- Samyuktha Menon






