Samantha : నాగచైతన్యపై కోపంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్న సమంత?

by Disha Web Desk 6 |
Samantha : నాగచైతన్యపై కోపంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్న సమంత?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆమెకు మయోసైటీస్ వ్యాధి రావడంతో ఇండస్ట్రీకి దూరమై ఇంట్లోనే ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. అయితే సామ్, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటున్నారు. అయినప్పటికీ వీరికి సంబంధించిన వార్తలు నిత్యం వైరల్ అవుతునే ఉన్నాయి. ఇటీవల సమంత రెండో పెళ్లిపై స్పందించినప్పటికీ పుకార్లు షికార్లు చేయడం ఆగడం లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా, సామ్, చైపై కోపంతో ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె తన మాజీ భర్తపై కోపంతో రెండో పెళ్లి చేసుకుంటుందని టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ అది చూసి వారు ఆశ్చర్యపోతున్నారు. ఇక నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల వరుస చిత్రాల్లో నటించినప్పటికీ హిట్ అందుకోలేక పోతున్నాడు.

ధూత వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెప్సాన్స్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం చై, చందూ మెండేటి డైరెక్షన్‌లో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా ఆఫర్ అందుకుంది. కాగా, ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జపాన్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed