- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా బ్యూటీకి స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ పంపిన సమంత.. పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు.
విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో డిసెంబర్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు . సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చి మంచి మార్కులే కొట్టేసింది.
అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలు, హెల్త్ టిప్స్‌ను చెబుతూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. అంతేకాకుండా మేకప్ ప్రొడక్ట్స్, మెడికల్ ప్రోడక్ట్ సెలబ్రిటీలకు పంపుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్‌కు కూడా స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ పంపించింది. ఇక దాన్ని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సామ్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సంయుక్త మీనన్(Samyuktha Menon) గత ఏడాది ‘విరూపాక్ష’(Virupaksha) సినిమాతో భారీ విజయం సాధించింది. ప్రస్తుతం శర్వానంద్(Sharwanand) సరసన ‘నారీ నారీ నడుమ మురారి’(Nari Nari Naduma Murari), బాలకృష్ణ(Balakrishna) సరసన ‘అఖండ-2’(Akhanda-2) మూవీలో నటిస్తోంది.






