- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
స్టార్ హీరోపై కత్తితో దాడి.. తన అరెస్టును చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ దరఖాస్తు దాఖలు చేసిన నిందితుడు

దిశ, వెబ్‌డెస్క్: నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శుక్రవారం ముంబైలోని ఒక కోర్టులో తన అరెస్టును చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ దరఖాస్తు దాఖలు చేశాడు. అరెస్టు సమయంలో తనకు అవసరమైన సమాచారం అంతా అందించలేదని అతను పేర్కొన్నాడు.
ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న బంగ్లాదేశ్ జాతీయుడు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం (30) గత నెలలో ముంబైలోని సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన తన బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకున్నాడు.
తర్వాత, నిందితుడు తన న్యాయవాది అజయ్ గావ్లి ద్వారా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (బాంద్రా) ముందు తన అరెస్టును చట్టవిరుద్ధమని ప్రకటించాలని.. అలాగే జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. దర్యాప్తు సంస్థ భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNSS) లోని సెక్షన్ 47 ను స్పష్టంగా విస్మరించింది. అందువల్ల నిందితుడిని చట్టవిరుద్ధంగా అరెస్టు చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
BNSS సెక్షన్ 47 ప్రకారం, అరెస్టు చేసే అధికారి నిందితుడికి అరెస్టుకు గల కారణాలను అండ్ బెయిల్ హక్కు గురించి తెలియజేయాలి. ఈ సెక్షన్ అరెస్టు చేసిన వ్యక్తి హక్కులకు సంబంధించినది. అరెస్టు చేసే అధికారి నిందితుడికి అరెస్టుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలి. బెయిలబుల్ నేరాల విషయంలో, వారికి బెయిల్ హక్కు గురించి కూడా తెలియజేయాలి. మరీ ఈ కేసు ఎలా తిరగనుందో చూడాలి.