- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైలెంట్‌గా ‘సంబరాల ఏటిగట్టు’ షూటింగ్ పూర్తి చేస్తున్న సాయి ధరమ్ తేజ్..
సాయి ధరమ్ తేజ్ సైలెంట్‌గా ముంబైలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం.

దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’.రోహిత్ కెపి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. ‘హనుమాన్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఇండియాన్ షేక్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ అప్డేట్స్ రాకపోవడంతో మధ్యలోనే ఆగిపోయినట్లు సాయి ధరమ్ తేజ్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో ఈ మూవీ ఇప్పట్లో విడుదల కష్టమే అని భావించిన మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారు.
ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. సాయి ధరమ్ తేజ్ సైలెంట్‌గా ముంబైలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. బాలీవుడ్‌లో అత్యంత గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు పాల్గొని కొన్ని కీలక యాక్షన్ సీన్స్ చేసినట్లు టాక్. జాతీయ స్థాయి నటుల ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌లోనూ పెరగడంతో పాటు అంచనాలను పెంచుతోంది. ఆ హిందీ స్టార్ నటుడు సినిమాకే హైలెట్‌గా నిలవబోతున్నట్లు టాక్. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రాన్ని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఆనందపడుతున్నారు.






