‘నాకు పెళ్లి కాకముందే అమితాబ్‌‌తో పరిచయముంది.. మేము ఒకే సర్కిల్ లో కలిసి తిరిగాం’.. వదిన రమోలా షాకింగ్ కామెంట్స్

by Anjali |
‘నాకు పెళ్లి కాకముందే అమితాబ్‌‌తో పరిచయముంది.. మేము ఒకే సర్కిల్ లో కలిసి తిరిగాం’.. వదిన రమోలా షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అమితాబ్ బచ్చన్ వదిన రమోలా బచ్చన్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూలో రమోలా మాట్లాడుతూ.. “నా స్నేహం అమితాబ్‌తో నాకు పెళ్లి కాకముందు నుంచే ఉందని వెల్లడించింది. నేను అజితాబ్‌ని కలవక ముందే మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని తెలిపింది. అమితాబ్ సినిమాకు ముందు రోజుల్లో కోల్‌కతాలో పనిచేశామని వెల్లడించింది.

మేము ఒకే సర్కిల్ లో తిరిగామని పేర్కొంది. నేను అతని ద్వారానే అజితాబ్ ని కలిశానని చెప్పుకొచ్చింది. మా మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉందని గుర్తు చేసుకుంది. అలాగే ఈ క్రమంలోనే అజితాబ్ బచ్చన్ కంటే అమితాబ్ బచ్చన్ ఐదు సంవత్సరాలు చిన్నవాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రమోలా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Next Story

Most Viewed