R. Madhavan: ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు.. భాష వివాదంపై మల్టీ స్టారర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు.. ఇలా మల్టీ స్టారర్‌గా గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు ఆర్. మాధవన్.

R. Madhavan: ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు.. భాష వివాదంపై మల్టీ స్టారర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు.. ఇలా మల్టీ స్టారర్‌గా గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు ఆర్. మాధవన్. ఆయన రీసెంట్‌గా ‘ఆప్ జైసా కోయి’తో ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు. వివేక్ సోని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా జులై 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవన్ భాషా వివాదంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మీకు ఎప్పుడైనా భాష పరంగా ఇబ్బంది ఎదురైందా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘లేదు.. నేను ఎప్పుడూ అలాంటిది అనుభవించలేదు. ఎందుకంటే నేను తమిళం, హిందీ భాషల్లో మాట్లాడతాను. అలాగే నేను కొల్హాపూర్‌లో కూడా చదువుకున్నాను. అక్కడ మరాఠీ కూడా నేర్చుకున్నాను. కాబట్టి, భాష కారణంగా నాకు ఎప్పుడూ ఎటువంటి సమస్య రాలేదు’ అని తెలిపాడు. Link

Next Story