sipligunjrahul: మౌనంగా ఏడ్చిన రోజులెన్నో.. కానీ చీకటిలో నీ గొంతు వెలుగుగానే ఉంది.. ప్రముఖ సింగర్ ఎమోషనల్ పోస్ట్

by Anjali |
sipligunjrahul: మౌనంగా ఏడ్చిన రోజులెన్నో.. కానీ చీకటిలో నీ గొంతు వెలుగుగానే ఉంది.. ప్రముఖ సింగర్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ... యూట్యూబ్ ద్వారా ఫేమ్ దక్కించుకున్న ఈ సింగర్ జోష్ మూవీలోని కాలేజ్ బుల్లోడ సాంగ్‌తో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవతో కలిసి పాడిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కు ఏకంగా ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. చిన్నప్పటి నుంచి పాటలపై ఉన్న ఇష్టంతోనే ఈయన ఈ స్టేజ్‌లో ఉన్నాడని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

జై బోలో ఎల్లమ్మ తల్లికి, పిల్లాహేయ్ పిల్లా, ఏం మాయో, గల్లీకా గణేష్, మంగమ్మ, పూర్ బాయ్, ఏనది, మైసమ్మ, పొయినవా, మగజాతి, దుమారే, దావత్, మాక్కికిరికిర వంటి సినిమాలకు సంగీతాన్ని సమకూర్చి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, గ్యాంగ్, చావు కబురు చల్లగా వంటి సినిమాలోని పలు సాంగ్స్ పాడాడు. ఇకపోతే ఈ సింగర్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు జిమ్ లో చెమటలు చిందిస్తోన్న ఫొటోలు, వీడియోలు పంచుకుంటాడు. తాజాగా రాహుల్ పాట పాడుతోన్న ఓ పిక్ పంచుకున్నాడు. దీనికి ఓ ఎమోషనల్ క్యాప్షన్ కూడా జోడించాడు. ‘‘ఖాళీ గదులను, కూలిపోయిన ప్రదేశాలను, నువ్వు మౌనంగా ఏడ్చిన రాత్రులను వాళ్లు చూడలేదు. కానీ నువ్వు పాడుతూనే ఉన్నావు ఎందుకంటే చీకటిలో కూడా నీ గొంతు వెలుగుగా ఉంది’’ అంటూ రాసుకొచ్చాడు.

Next Story