- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పెద్ది’లో జాన్వీ కపూర్ గ్లామర్ సీన్ల వివాదం.. నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్
ఇటీవల విడుదలైన 'పెద్ది' సినిమాలో కథానాయిక జాన్వీ కపూర్ (అచ్చియమ్మ పాత్ర)ను గ్లామరైజ్‌గా చూపించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల విడుదలైన 'పెద్ది' సినిమాలో కథానాయిక జాన్వీ కపూర్ (అచ్చియమ్మ పాత్ర)ను గ్లామరైజ్‌గా చూపించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై ప్రముఖ నటి నిత్యా మీనన్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇంకా ఆ సినిమా చూడలేదని చెప్తూనే, తెరపై మహిళలను కేవలం ఒక వస్తువుగా (Objectification) చూపించడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. అయితే, ఇలాంటి ధోరణి కేవలం దక్షిణ భారత సినిమా (సౌత్ సినిమా)కే పరిమితం కాలేదని, ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఉన్న సమస్య అని ఆమె అన్నారు. సినిమాల్లో ఇలా జరగడానికి ప్రధాన కారణం 'హైపర్-కమర్షియలైజేషన్' (సినిమాలను విపరీతంగా వ్యాపార ధోరణితో తీయడం) అని నిత్యా మీనన్ అభిప్రాయపడ్డారు. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడానికి, ప్రేక్షకులను ఆకర్షించడానికి ఇలాంటి సీన్లు పెడుతుంటారని, ఇది కచ్చితంగా హద్దులు దాటడమేనని ఆమె అన్నారు.
నటీనటులే హద్దులు పెట్టుకోవాలి..
నటీనటులు తమకంటూ కొన్ని స్పష్టమైన హద్దులను (Boundaries) ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. "తమకు ఇష్టం లేని సీన్లు ఉన్నప్పుడు లేదా తమను కేవలం గ్లామర్ వస్తువుగా వాడుకుంటున్నారని అనిపించినప్పుడు, నటీనటులు గట్టిగా నిలబడి 'నాకిది ఇష్టం లేదు' అని చెప్పగలగాలి. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. నాకు పేరు ప్రతిష్టల కంటే నా వీలువలే ముఖ్యం, అందుకే నేను కొన్ని రకాల పాత్రలకు దూరంగా ఉంటాను" అని నిత్యా మీనన్ పేర్కొన్నారు. చాలా ఏళ్ల పాటు కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేసి, హఠాత్తుగా ఒక రోజు అభ్యంతరం చెప్తే పరిశ్రమలో ఎవరూ సీరియస్‌గా తీసుకోరని, అందుకే కెరీర్ మొదటి నుంచే తమ హద్దుల విషయంలో నటీనటులు స్పష్టంగా ఉండాలని ఆమె సలహా ఇచ్చారు.
అసలు వివాదం ఏమిటి?
'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను పరిచయం చేసే సీన్లలో ఆమె ముఖం చూపించకుండా కేవలం శారీరక సౌందర్యంపైనే కెమెరా ఫోకస్ పెట్టడంపై విమర్శకులు మండిపడ్డారు. ఈ విమర్శల తీవ్రత దృష్ట్యా. దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే స్పందిస్తూ.. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకు లేదని చెప్తూ క్షమాపణలు చెప్పారు. ప్రేక్షకుల ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆ వివాదాస్పద సీన్లలో మార్పులు (ఎడిట్) చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. మరోవైపు ఇప్పటివరకు ఈ వివాదంపై నటి జాన్వీ కపూర్ స్పందించకపోవడం గమనార్హం.






